Gandhi: ఎలక్ట్రిక్‌ వ్యర్థాలతో 6 అడుగుల గాంధీజీ విగ్రహం!

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒడిశాలోని బ్రహ్మపుర ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. దాదాపు 105 కిలోల ఎలక్ట్రిక్‌ వ్యర్థాలతో 6 అడుగుల గాంధీజీ విగ్రహాన్ని రూపొందించారు. తద్వారా మహాత్ముడిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Updated : 03 Oct 2022 00:48 IST

బ్రహ్మపుర: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒడిశాలోని బ్రహ్మపుర ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. దాదాపు 105 కిలోల ఎలక్ట్రిక్‌ వ్యర్థాలతో 6 అడుగుల గాంధీజీ విగ్రహాన్ని రూపొందించారు. తద్వారా మహాత్ముడిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విగ్రహం తయారీకి 1,600 ఫ్యాన్‌ బేరింగులు, కారు సీటు బెల్టు, ఇనుప రాడ్డులను ఉపయోగించినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ రజత్‌ కుమార్‌ పాణిగ్రాహి తెలిపారు. ఫిట్టర్‌, వెల్డింగ్‌ విభాగానికి చెందిన 30 మంది విద్యార్థులు, అధ్యాపకులు కలిసి 15 రోజులపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని తెలుసుకున్న ఎలక్ట్రికల్‌  వర్కషాప్‌ యజమానులు, ఆటోమొబైల్‌ గ్యారేజీ యజమానులు ఉచితంగానే వాటిని ఇచ్చారన్నారు. ఎలక్ట్రిక్‌ వ్యర్థాలతో ఇన్‌స్టిట్యూట్‌ ఆవరణలోనే అధ్యాపకుల సాయంతో విద్యార్థులు గాంధీ విగ్రహాన్ని తయారు చేసినట్టు ప్రిన్సిపాల్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు