జ్యోతి దర్శనం.. శరణం అయ్యప్ప

హరిహరక్షేత్రం శబరిమల స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తిసాగరంలో మునిగిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం సుదీర్ఘంగా నిరీక్షించారు

Updated : 14 Jan 2021 19:09 IST

సన్నిధానం: హరిహరక్షేత్రం శబరిమల ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తిసాగరంలో మునిగిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం సుదీర్ఘంగా నిరీక్షించారు. ఆ నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. మనసునిండుగా భక్తిభావంతో తన్మయం చెందినభక్తులు స్వామియే అంటూ శరణమిల్లారు.

ఇదీ చదవండి..

శబరి కొండపై స్వర్ణ సంబరం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని