Kerala : సామాజిక సేవ కోసం గడ్డం పెంచుతున్నారు..!

గడ్డం కొంచెం పెరిగితేనే చిరాకుగా ఉంటుంది. పైగా అలా ఉంటే.. ఇతరుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మరి అలాంటిది ఏళ్ల తరబడి గడ్డాలను పెంచాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. కానీ, మాకు మాత్రం అస్సలు ఇబ్బందే లేదంటున్నారు కొందరు కేరళ యువకులు. ఓ సత్సంకల్పం కోసం తమ గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు....

Published : 05 Dec 2021 13:23 IST

తిరువనంతపురం : గడ్డం కొంచెం పెరిగితేనే చిరాకుగా ఉంటుంది. పైగా అలా ఉంటే.. ఇతరుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మరి అలాంటిది ఏళ్ల తరబడి గడ్డాలను పెంచాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. కానీ, మాకు మాత్రం అస్సలు ఇబ్బందే లేదంటున్నారు కొందరు కేరళ యువకులు. ఓ సత్సంకల్పం కోసం తమ గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు.

పొడవాటి గడ్డమున్న వ్యక్తిని చూస్తే చాలా మందికి సానుభూతి.. మరి కొందరికి వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. చక్కగా ట్రిమ్‌ చేసి పెంచితే సరేసరి, లేదంటే పొడవాటి గడ్డాలను చూస్తే ఏదో కష్టాల్లో ఉన్నాడని అనుకుంటారు. అయితే ఇలాంటి అభిప్రాయాలు ఎన్ని వినిపించినా.. ఈ కేరళ యువకులు మాత్రం ఓ మంచి ఉద్దేశంతో గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు. వీరంతా కేరళ బియర్డ్‌ సొసైటీ  సభ్యులు. వీరి గడ్డాల వెనుక సామాజిక సేవాదృక్పథం దాగి ఉంది. షేవింగ్‌ చేయించుకోవాలంటే డబ్బులు ఖర్చు చేయాలి. ఇంట్లో చేసుకున్నా ఎంతొకొంత ఖర్చు తప్పదు. దానికయ్యే ఖర్చులను దాచి పెట్టి, ఆ డబ్బులను సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నారు. మలప్పురానికి చెందిన అనాజ్‌ అబ్దుల్లా  2017లో తన మిత్రులతో కలిసి ఈ సొసైటీని ప్రారంభించారు. ఇందులో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నారు. గడ్డాన్ని ఎక్కువగా పెంచడం వల్ల కుటుంబ సభ్యుల నుంచే కాదు.. బయట నుంచి కూడా అప్పుడప్పుడూ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయితే.. సమస్యలు ఎన్ని వచ్చినా.. సామాజిక సేవకోసం గడ్డాన్ని పెంచాలన్న తమ సంకల్పాన్ని మాత్రం తాము వీడబోమని చెబుతున్నారు. వారి మంచి ఉద్దేశాన్ని తెలుసుకున్న కొందరు ప్రోత్సహిస్తున్నారని వివరించారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని