Maldives: భారత పర్యాటకులకు నో ఎంట్రీ

కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా మాల్దీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మే

Published : 12 May 2021 13:17 IST

మాల్దీవులు: కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా మాల్దీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మే 13 గురువారం నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు మాల్దీవులు ఇమ్మిగ్రేషన్‌ విభాగం ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. 

‘‘దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. అన్ని రకాల వీసాదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. మే 13 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. గత 14 రోజుల్లో దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన ఇతర దేశాల పర్యాటకులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి’’ అని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్‌ ట్వీట్ చేసింది. ఈ నిషేధంపై అక్కడి భారత హై కమిషన్‌ స్పందించింది. మాల్దీవులు నిర్ణయం.. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ,అందువల్ల ఇక్కడ ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.

భారత్‌ నుంచి మాల్దీవులుకు ఏటా లక్షల మంది విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇటీవల కరోనా మొదటి దశ ఉద్ధృతి కాస్త తగ్గిన తర్వాత సినీ ప్రముఖులు వరుసగా మాల్దీవులు బాట పట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని