Mamata Banerjee: పైలట్‌ చాకచక్యం.. బెంగాల్‌ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. తన ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరో ప్లేన్‌ ఢీకొట్టే ప్రమాదం నుంచ...

Updated : 08 Mar 2022 04:38 IST

కోల్‌కతా: విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. తన ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరో విమానం ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. 8 వేల అడుగులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మరో విమానం తమ ఎయిర్‌క్రాఫ్ట్‌ వైపు వచ్చిందని మమత పేర్కొన్నారు. పైలట్‌ చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినట్లు మమత తెలిపారు. విమానం గురించి ఏటీసీ, డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని