హెలికాప్టర్‌ దుర్ఘటనపై మమత షాక్‌.. సమావేశాన్ని మధ్యలోనే ముగించి బయటకు..!

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా 14మంది ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూలిపోయిన ఘటనపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి ......

Updated : 08 Dec 2021 17:45 IST

మాల్దా: సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా 14మంది ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూలిపోయిన ఘటనపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అధికారులతో సమీక్షలో ఉండగా ఈ ప్రమాదం గురించి తెలియడంతో మధ్యలోనే సమావేశాన్ని ముగించారు. ‘‘ఎంతో బాధాకరమైన వార్త తెలిసింది. ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యా. తీవ్ర బాధలో ఉన్న నాకు మాటలు రావడం లేదు. సమావేశాన్ని ముగించి బయటకు వచ్చేశా’’ అని దీదీ తెలిపారు.

ఈ దుర్ఘటనపై దీదీ ట్విటర్‌లోనూ తన ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘కూనూరులో జరిగిన ఘటన తీవ్ర విషాదం రేపింది. బిపిన్‌ రావత్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ హెలికాప్టర్‌లో ఉన్నవారందరూ క్షేమంగా ఉండాలని యావత్‌ దేశం ప్రార్థిస్తోంది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రతిఒక్కరూ త్వరగా కోలుకోవాలి’’ అని మమత ఆకాంక్షించారు.

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న విమానం తమిళనాడులోని కూనూరు వద్ద కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితిని విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జనరల్‌ బిపిన్‌ రావత్‌ పరిస్థితికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంతవరకు రాకపోవడం గమనార్హం.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని