ఆకాశానికి పెట్రో ధరలు: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై సీఎం! 

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నిరసన వ్యక్తంచేశారు. గురువారం .....

Published : 25 Feb 2021 17:53 IST

కోల్‌కతా: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నిరసన వ్యక్తంచేశారు. గురువారం ఆమె హెల్మెట్‌ ధరించి ఓ ఎలక్ట్రిక్‌ స్కూటరెక్కి నిరసన చేపట్టారు. కోల్‌కతాలోని హజ్రా మోర్‌ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు దాదాపు 5కి.మీల మేర మంత్రి ఫిరాద్‌ హకీం నడిపిన స్కూటర్‌ వెనుక కూర్చొని మెడలో బ్యానర్‌తో ముందుకు సాగారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు.  మోదీ ప్రభుత్వం కేవలం తప్పుడు వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. చమురు ధరలను తగ్గించేందుకు భాజపా సర్కార్‌ చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి, ఇప్పటి పెట్రోల్‌ ధరల్లో తేడాను గమనించవచ్చని తెలిపారు.  మోదీ, అమిత్‌షా దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమంటూ దీదీ మండిపడ్డారు. 

అహ్మదాబాద్‌లోని మోతేరాలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి మోదీ పేరును పెట్టడంపై విమర్శలు చేశారు. దేశంలోని పలు నగరాల్లో  పెట్రోల్‌ ధరలు రూ.90 మార్కును దాటేశాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.91.12లుగా ఉండగా.. చెన్నైలో రూ.92.90, బెంగళూరులో రూ.93.98, భువనేశ్వర్‌లో రూ.92, హైదరాబాద్‌లో రూ.94.54, జైపూర్‌లో రూ.97.34, పట్నాలో రూ.93.53, తిరువనంతపురంలో రూ.92.81ల చొప్పున ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని