Vaccines: మోదీకి  దీదీ లేఖ 

ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీకా....

Published : 20 May 2021 22:26 IST

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీకా ఇచ్చేందుకు వీలుగా 20లక్షల డోసులు బెంగాల్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు.   కొవిడ్‌ ముప్పు అధికంగా ఉండే వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు లేవని పేర్కొన్నారు. బ్యాంకర్లు, రైల్వే, విమానాశ్రయ ఉద్యోగులు, వీరితో పాటు డిఫెన్స్‌, బొగ్గు రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు టీకా వేయించేందుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని దీదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు టీకా వేయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఇచ్చేందుకు  ఇప్పుడు కనీసం తమకు 20లక్షల డోసుల టీకా అవసరమని తెలిపారు. ప్రాధాన్యతా రంగాల్లో ఉన్న సిబ్బందికి టీకాలు వేసేందుకు వీలుగా ఆలస్యం చేయకుండా తగినంత వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని ప్రధానిని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు