శశిథరూర్‌ స్టయిల్‌లో లీవ్‌ లెటర్‌.. ChatGPT సమాధానంపై కాంగ్రెస్‌ ఎంపీ రియాక్షన్‌

లీవ్‌ లెటర్‌ రాయడానికి ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. శశిథరూర్‌ స్టయిల్‌లో కావాలని కోరాడు. దానికి చాట్‌బాట్‌ ఇచ్చిన సమాధానాన్ని ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ చేయగా.. దానికి శశి థరూర్‌ సైతం స్పందించారు.

Updated : 18 Jan 2023 07:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధతో రూపొందిన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) గురించి ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు తమ స్కూల్‌ హోమ్‌ వర్క్‌లను సులువుగా చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుండగా.. మరికొందరు చాట్‌జీపీటీతో సరదా సంభాషణలు నెరుపుతున్నారు. తమకు వచ్చిన సమాధానాన్ని స్క్రీన్‌షాట్‌ రూపంలో ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి లీవ్‌ లెటర్‌ రాయడానికి ఇలానే చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. అయితే శశిథరూర్‌ స్టయిల్‌లో కావాలని చాట్‌జీపీటీని కోరాడు. దానికి చాట్‌బాట్‌ ఇచ్చిన సమాధానాన్ని ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ చేయగా.. దానికి శశి థరూర్‌ సైతం స్పందించారు.

నిశాంత్‌ విజయన్‌ అనే వ్యక్తి రేపు తాను ఆఫీసుకు రావడం లేదనే విషయాన్ని శశిథరూర్‌ స్టయిల్‌లో రాయాలని చాట్‌జీపీటీని కోరగా.. అందుకు చాట్‌బాట్‌ సమాధానం ఇచ్చింది. అందులో కాస్త కవిత్వాన్ని, క్లిష్టమైన ఆంగ్ల పదాలను ఉపయోగించింది. దాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనిపై శశిథరూర్‌ స్పందించారు. సరదాగా ఉందని కామెంట్‌ చేస్తూనే.. తానైతే మరీ సులభంగా రాయను అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెజూన్‌ (jejune) అంటూ మరో కొత్త పదాన్ని వాడారు. దీంతో ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీంతో చాట్‌జీపీటీకే సరైన పోటీదారు మీరేనంటూ ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టారు. ఈసారి మీరు ట్వీట్‌ పెట్టేటప్పుడు ఆన్‌లైన్‌ డిక్షనరీ లింక్‌ కూడా పెట్టండి సర్‌ అంటూ మరో యూజర్‌ రాసుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని