కరోనా అని.. విమానమంతా బుక్‌ చేసుకుని!

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయినా కూడా ఇప్పటికీ రద్దీ ప్రాంతాలకు వెళ్లాలన్నా.. నలుగురిలో కలవాలన్నా భయంగానే ఉంటోంది. తప్పనిసరై వెళ్లాల్సి వచ్చేవారు మాస్క్‌లు

Published : 08 Jan 2021 12:05 IST

జకార్తా(ఇండోనేషియా): కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయినా కూడా ఇప్పటికీ రద్దీ ప్రాంతాలకు వెళ్లాలన్నా.. నలుగురితో కలవాలన్నా భయంగానే ఉంటోంది. తప్పనిసరై వెళ్లాల్సి వచ్చేవారు మాస్క్‌లు, ఇంకాస్త రక్షణ కోసం పీపీఈ కిట్లు ధరించక తప్పట్లేదు. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి విమాన ప్రయాణంలో వైరస్‌ నుంచి రక్షణ కోసం ఏకంగా విమానంలోని అన్ని సీట్లను బుక్‌ చేసుకున్నాడు. 

జకార్తాకు చెందిన రిచర్డ్‌ ముల్‌జాదీ ఇటీవల తన భార్య షల్విన్నీ ఛాంగ్‌తో కలిసి బాలీకి వెళ్లారు. అయితే ఇందుకోసం ఆయన లయన్‌ ఎయిర్‌ గ్రూప్‌నకు చెందిన బాటిక్‌ ఎయిర్‌ విమానంలోని అన్ని టికెట్లు బుక్‌ చేసుకున్నారు. విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని భావించిన రిచర్డ్‌.. వైరస్‌ నుంచి రక్షణ కోసం ఈ విధంగా విమానం మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని రిచర్డ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఖాళీగా ఉన్న విమానంలో కూర్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘విమానంలోని సీట్లన్నీ బుక్‌ చేసినా కూడా.. ప్రైవేట్‌ జెట్ కంటే తక్కువ ఖర్చే అయ్యింది’ అని ఆయన రాసుకొచ్చారు. 

ఇవీ చదవండి..

రికవరీ రేటు.. భారత్‌దే అగ్రస్థానం

కరోనాతో వారికి అధిక ముప్పే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని