చిరకాల కోరిక.. రూ.90 వేల చిల్లర నాణేలతో బైక్‌ కొన్నాడు

అస్సాంలోని దరంగ్‌ జిల్లా సిపజార్‌కు చెందిన మహమ్మద్‌ సైదుల్‌ హఖ్‌కు ద్విచక్రవాహనం కొనాలన్నది చిరకాల వాంఛ. బోరేగావ్‌ ప్రాంతంలో చిన్న దుకాణం.

Updated : 23 Mar 2023 08:52 IST

స్సాంలోని దరంగ్‌ జిల్లా సిపజార్‌కు చెందిన మహమ్మద్‌ సైదుల్‌ హఖ్‌కు ద్విచక్రవాహనం కొనాలన్నది చిరకాల వాంఛ. బోరేగావ్‌ ప్రాంతంలో చిన్న దుకాణం నడుపుకొనే సైదుల్‌ హఖ్‌ దీని కోసం రోజూ కొంత పొదుపు చేసి అయిదారేళ్లుగా చిల్లర నాణేలు పోగేశాడు. ఈ నాణేలన్నింటినీ ఓ బస్తాలో వేసుకొని నేరుగా స్కూటర్‌ షోరూంకు చేరుకున్నాడు. రూ.90 వేల విలువగల బైక్‌ను చిల్లర నాణేలతో కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడని సిబ్బంది చెప్పడం విని తాను ఆశ్చర్యానికి గురైనట్లు షోరూం యజమాని వెల్లడించారు. ఇన్నాళ్లూ తాను కలలుగన్న ద్విచక్రవాహనంతో సైదుల్‌ హఖ్‌ ఆనందంగా ఇంటికి వెళ్లాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు