Mamata Banerjee: సీఎం నివాసంలోకి ఆగంతకుడు.. రాత్రంతా అక్కడే..!

కోల్‌కతా కాళీఘాట్‌లోని సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో ఓ ఆగంతకుడు ప్రవేశించాడు........

Published : 04 Jul 2022 01:49 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద మరోసారి భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. కోల్‌కతా కాళీఘాట్‌లోని సీఎం నివాసంలోకి శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రంతా ఆ వ్యక్తి ఇంటి గోడ వద్దే నక్కి ఉన్నాడు. ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది అతడిని గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.

ముఖ్యమంత్రి నివాసం చుట్టూ నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సీఎం మమతా బెనర్జీకి కూడా జెడ్​ప్లస్ ​సెక్యూరిటీ ఉంది. అయితే, ఇంత నిఘా ఉన్నప్పటికీ సీఎం నివాసంలోకి ఆ వ్యక్తి ఎలా చొరబడ్డాడో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్‌ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జెడ్‌ కేటగిరీ భద్రత ఉన్న ప్రాంతానికి ఆ ఆగంతకుడు ఎలా చేరుకున్నాడు? అతడు దొంగా లేక మానసిక స్థితి సరిగాలేని వ్యక్తా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మమతా బెనర్జీ ఇంటి సమీపంలోనే కొద్దిరోజుల క్రితం జంట హత్యలు కలకలం రేపాయి. అప్పుడు కూడా దీదీ ఇంటి వద్ద భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఆ సమయంలో పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని