America:కదులుతున్న విమానం నుంచి దూకేశాడు!

అది..అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. యునైటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ విమానం టేక్‌ ఆఫ్‌ అయ్యేందుకు రన్‌వేపై వేగంగా కదులుతోంది. ఇంతలో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా విమానం తలుపు తెరచుకొని బయటకు దూకేశాడు.

Published : 27 Jun 2021 18:27 IST

వాషింగ్టన్: అది..అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. యునైటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ విమానం టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపై వేగంగా కదులుతోంది. ఇంతలో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా విమానం తలుపు తెరచుకొని బయటకు దూకేశాడు. అంతే.. ఆశ్చర్యపోవడం విమానాశ్రయ అధికారుల వంతైంది.  శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లాస్‌ఏంజెల్స్‌ నుంచి  యునైటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానం శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో సాల్ట్‌ లేక్‌ నగరానికి పయనమైంది. ఇంతలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే లోపలికి వచ్చి.. అత్యవసర ద్వారం తెరచి బయటకు దూకేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రన్‌వే పైనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నపాటి గాయాలవ్వడంతో విమానాశ్రయ ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.  అయితే, ఎందుకలా దూకాడన్న దానిపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనతో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలు దేరింది. 

గత రెండు రోజుల వ్యవధిలోనే ఇలా జరగడం ఇది రెండో సారి. గురువారం కూడా అదే విమానాశ్రయంలో ఇలాంటి తరహా ఘటనే జరిగింది. విమానాశ్రయానికి వెనుకవైపున్న ఫెన్సింగ్‌ను తోసుకుంటూ ఓ కారు డ్రైవర్‌ హఠాత్తుగా రన్‌వే పైకి వచ్చేశాడు. అప్రమత్తమైన అధికారులు అదే రన్‌వేపై టేక్‌ ఆఫ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపేశారు.  పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని