ADAS: సాంకేతికతను ఇలా వాడితే ఎలా భయ్యా..?

అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS) సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. స్టీరింగ్‌ వదిలేసి రీల్స్‌ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.

Published : 13 Mar 2023 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ.. వీలైంత వరకు ప్రాణాపాయం జరగకుండా ఉండేందుకు అభవృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS)ను కొందరు దుర్వినియోగం (Miss use of Technology) చేస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం స్టీరింగ్‌ని (Car Steering) వదిలేసి రీల్స్‌ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి లైక్‌లు, షేర్లు చూసి మురిసిపోతున్నారే తప్ప.. ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితులు తలకిందులవుతాయని మర్చిపోతున్నారు.

ఎక్కడ జరిగిందో తెలియదుగానీ..  మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వాహనంలో ఇద్దరు భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్న భర్త.. స్టీరింగ్‌ వదిలేసి..భార్యతో సరదాగా పోట్లాడుకుంటున్నాడు. అంతేకాకుండా పక్కసీట్‌పై కాలు వేసి దర్జాగా కూర్చున్నాడు. దీన్ని వెనుక సీట్లో కూర్చున్న వేరే వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అనంతరం ఈ వీడియోను ‘ఎక్స్‌రోడర్స్‌’ అనే ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా అతడి తీరును తప్పుబడుతున్నారు. అంత బాధ్యతారాహిత్యంతో డ్రైవింగ్‌ సీట్లో కూర్చోవడం మంచిది కాదని అంటున్నారు. సాంకేతికతను అవసరానికి వాడుకోవాలే తప్ప.. ఇలా దుర్వినియోగం చేయకూడదని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి రీల్స్‌తోనే ప్రాణాలు పోతాయని మరో యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని