Published : 16 Aug 2022 17:27 IST

Mukesh Ambani: ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు.. నిందితుడికి ఆగస్టు 30వరకు పోలీసు కస్టడీ

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) కుటుంబానికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసిన నిందితుడిని కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రెండు గంటల వ్యవధిలోనే ఎనిమిది ఫోన్‌ కాల్స్‌ చేసిన బిష్ణు భౌమిక్‌ (56) అనే నగల వ్యాపారిని నిన్న అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ముంబయిలోని 37వ మెజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడిని ఈ నెల 30వరకు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిందితుడు దురుద్దేశంతోనే పంద్రాగస్టు రోజున బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌ చేశాడని.. మరే రోజైనా ఎందుకు చేయలేదని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. ముకేశ్ అంబానీకి ముప్పు ఉందని.. ఈ కేసు చిన్నదేమీ కాదని.. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని న్యాయవాది కోర్టును కోరారు.

ప్రాసిక్యూషన్‌ వాదనలను నిందితుడి తరఫు న్యాయవాది తప్పుబట్టారు. భౌమిక్‌ ఆస్పత్రికి ఫోన్‌ చేశాడని.. నేరుగా అంబానీకి చేయలేదన్నారు. కానీ ఆయనకే నేరుగా ఫోన్‌ చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారన్నారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని, ఓ సైకియాట్రిస్ట్‌ వద్ద చికిత్స పొందుతున్నట్టుగా తన వద్ద సర్టిఫికెట్‌ కూడా ఉందని కోర్టుకు తెలిపారు. బిష్ణు భౌమిక్‌కు ఎలాంటి దురుద్దేశం లేదని.. అతడు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడలేదని కోర్టుకు తెలిపారు. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని ఈ నెల 30 వరకు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని