
ఇక.. ఏడాది పొడవునా మామిడి
కొత్తరకాన్ని కనిపెట్టిన రాజస్థాన్ రైతు
దిల్లీ: ఏడాది పొడవునా మామిడి కాయలు కాసే కొత్త రకాన్ని రాజస్థాన్‌లోని కోటాకు చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు కనిపెట్టినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సదాబహార్ (సతతహరితం) పేరుతో రూపొందించిన ఈ పొట్టి రకం మామిడి సాధారణ తెగుళ్లు అన్నింటినీ తట్టుకుని ఏడాది పొడవునా కాపు ఇస్తుందని తెలిపింది. ‘‘ఉత్తర భారత్‌లో ఎక్కువగా లభించే లంగడా రకంతో పోలిస్తే ఈ పండు చాలా పొట్టిగా ఉంటుంది. పెరటి తోటల్లో, కుండీల్లో పెంచుకోవచ్చు. ముదురు కమలాపండు రంగులో కనిపించే దీని కండ భాగం చాలా తియ్యగా ఉంటుంది. పుష్కలమైన పోషకాలతో నిండిన ఈ మామిడి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ సరికొత్త మామిడిని కనుగొనడం వెనక పేదరికంలో పుట్టిపెరిగిన శ్రీకిషన్ మేధోసంపత్తి ఉంది. రెండో తరగతితో చదువు ఆపేసిన ఆయన 2000 సంవత్సరంలో తన తోటలోని ఓ మామిడి మొక్క మిగతా వాటికంటే భిన్నంగా ఏడాది పొడవునా కాయలు కాయడాన్ని గమనించారు. దానికి అయిదు అంట్లు కట్టి కొత్త రకాలు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించారు. అలా కట్టిన అంట్లను భద్రపరుస్తూ కొత్త రకం తయారుచేయడానికి ఆయనకు 15 ఏళ్లు పట్టింది. ఇలా అంటుకట్టిన మొక్క రెండో యేట నుంచే పండ్లు కాయడాన్ని గమనించారు. సదాబహార్‌పై నమ్మకం కుదరడంతో ఆ మొక్కను రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్‌లో నాటడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) చొరవ తీసుకుంది. శ్రీకిషన్ సుమన్‌కు 9వ నేషనల్ గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డు ఇచ్చింది. ఈ కొత్త రకం మామిడి కోసం 2017-20 మధ్యకాలంలో 8వేల ఆర్డర్లు వచ్చాయి. 2018-20 మధ్యకాలంలో శ్రీకిషన్ దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు 6వేల మొక్కలు సరఫరా చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలకు 500 మొక్కలు ఇచ్చారు. అలాగే 400 అంటు మొక్కలను వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు సరఫరా చేశారు’’ అని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ వివరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోండిలా..
-
Movies News
Pawan Kalyan: ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి: పవన్‌కల్యాణ్
-
India News
Modi: ఆ చిన్నారిని కలిశాక.. నాలో విశ్వాసం పెరిగింది: మోదీ
-
World News
USA Mass Shooting: తుపాకీ నీడన అమెరికా.. అత్యాధునిక ఆయుధంతో 22ఏళ్ల యువకుడి కాల్పులు
-
India News
India Corona: 13 వేల కొత్త కేసులు.. 12 వేల రికవరీలు..!
-
Sports News
Bumrah : బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. SENAపై అదరగొట్టేసిన టీమ్ఇండియా పేసర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు