Tripura: 8న త్రిపుర సీఎం ప్రమాణం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

త్రిపురలో కొత్త ప్రభుత్వ సారథిగా ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 04 Mar 2023 23:50 IST

అగర్తల: త్రిపురలో కొత్త ప్రభుత్వ సారథిగా ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 స్థానాలకు గాను భాజపా 32 సీట్లు, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ ఒక చోట గెలుపొందాయి. ఈ నెల 8న అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అగర్తలలోని వివేకానంద మైదానంలో జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారని సీనియర్‌ అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు