అందాల లోయలో కార్చిచ్చు
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో కార్చిచ్చు భయపెడుతోంది. నాగాలాండ్ సరిహద్దుల్లోని జుకోవు లోయలో గల అడవుల్లో రేగిన కార్చిచ్చు పొరుగున ఉన్న మణిపూర్‌కు వ్యాపించింది. ఈ రాష్ట్రంలోని
ఇంఫాల్/కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో కార్చిచ్చు భయపెడుతోంది. నాగాలాండ్‌లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాల్లో ఒకటైన జుకోవు లోయలో మూడు రోజుల కిందట మొదలైన ఈ దావాగ్ని అంతకంతకూ పెరుగుతోంది. గురువారం మంటలు అదుపులోకి వచ్చినట్లే కన్పించిన ఆ తర్వాత పొరుగున ఉన్న మణిపూర్‌కు కార్చిచ్చు వ్యాపించింది. ఈ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో ఉన్న అడవులకు దావాగ్ని వ్యాపించడంతో మణిపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంటలను అదుపుచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సాయం కోరింది.
సేనాపతి జిల్లాలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ నిన్న ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు కార్చిచ్చు పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. సీఎంతో ఫోన్లో చర్చించారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు బీరెన్ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది, వాలంటీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు నాగాలాండ్ ప్రభుత్వం కూడా హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది
‘పూల లోయ’గా పిలిచే జుకోవు వ్యాలీలో కార్చిర్చు చెలరేగడంతో ఈ ప్రాంతంలో జీవవైవిధ్యానికి భారీ నష్టం జరిగే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు సమీపంలోనే ఈ లోయ ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందిన ఈ లోయకు ట్రెక్కర్లు ఎక్కువగా వస్తుంటారు. సాహసాలకు నెలవైన ఈ లోయ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాంటి లోయలో మంటలు చెలరేగి వందల సంఖ్యలో చెట్టు బూడిదవుతున్నాయి.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు