Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
మణిపుర్‌లో భయానక వాతావరణం సృష్టించేందుకు వేర్పాటు వాదులు పన్నిన కుట్రను భారత సైన్యానికి చెందిన స్పియర్ కోర్ కమాండ్ బహిర్గతం చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: మహిళలు, పిల్లలతో సహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకొని గ్రామాలపై దాడులు చేయాలన్న మణిపూర్(Manipur) వేర్పాటు వాదుల కుట్రను సైన్యం బహిర్గతం చేసింది. మణిపుర్‌లో హింసే లక్ష్యంగా వేర్పాటు వాదులు ఈ కుట్రను పన్నినట్లు పేర్కొంది. ఇటీవల వేర్పాటువాదల కమ్యూనికేషన్ వ్యవస్థలోకి స్థానికంగా ఉన్న సైన్యానికి చెందిన ‘స్పియర్ కోర్ కమాండ్’ చొరబడింది. అక్కడ వారి సంభాషణలకు సంబంధించిన ట్రాన్స్‌స్క్రిప్ట్ తాజాగా స్పియర్‌కోర్ ట్విటర్‌లో పోస్టు చేసింది. దీనిలో భద్రతా దళాలను అడ్డుకొనేందుకు అమాయక పౌరులను వాడుకోవాలనే ప్రణాళికలపై వేర్పాటువాదులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను కవచాలుగా వాడుకొని మే27 నాటికి ఓ గ్రామాన్ని ధ్వంసం చేయాలనే కుట్రపై మాట్లాడుకొన్నారు. ఈ క్రమంలో పిల్లలు, మహిళలు మరణిస్తే.. సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భావించారు. ఆ వేర్పాటు వాదుల వద్ద తగినన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు మరిన్ని ఆయుధాలను సేకరించడంపై కూడా దృష్టిపెట్టినట్లు తేలింది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న అస్థిరతను వాడుకొని చాలా వేర్పాటు వాద సంస్థలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నాయి.
మణిపుర్‌లో ఆదివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కొండ ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన సాయుధులైన కుకీ మిలిటెంట్లు లోయల్లోని మేతీ తెగకు చెందిన 8 గ్రామాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు సహా ఐదుగురు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. మరోవైపు ఆయుధాలతో తిరుగుతున్న 40 మంది కుకీ మిలిటెంట్లను భద్రతా బలగాలు ఇప్పటివరకూ కాల్చి చంపాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు.
భారత సైన్యం ముగ్గురు వేర్పాటు వాదులను అరెస్టు చేసింది. వీరి వద్ద ఇన్సాస్ రైఫిల్, మ్యాగ్జైన్, ఆరు రౌండ్ల తూటాలు, ఓ చైనా గ్రనేడ్, డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. తూర్పు ఇంఫాల్‌లోని చెకున్‌లో వీరిని అరెస్టు చేశారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah ) నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన నేటి సాయంత్రం ఇంఫాల్(Imphal) ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
-
Rajinikanth: కరుణానిధి సంభాషణలా.. అమ్మబాబోయ్!