Manipur landslide: 27కు చేరిన మణిపుర్‌ మృతులు.. 20 మంది జవాన్లే..!

మణిపుర్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో తాజాగా మరో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి........

Published : 02 Jul 2022 17:31 IST

గువాహటి: మణిపుర్‌ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలికితీసిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 27కి చేరింది. కాగా వీరిలో 20 మంది ప్రాదేశిక సైన్యానికి చెందిన జవాన్లు, ఏడుగురు పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఇంకా దాదాపు 35 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో జవాన్లతోపాటు సాధారణ పౌరులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తుపుల్ రైల్వే యార్డ్ ప్రమాద స్థలానికి సమీపంలోనే మరో చోట కొండచరియ విరిగిపడటంతో అక్కడి ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు