Published : 25/04/2021 02:02 IST

మన్మోహన్‌సింగ్‌ కోలుకుంటున్నారు...

దిల్లీ: కరోనా బారిన పడి దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని కాంగ్రెస్‌ వెల్లడించింది. ఈ మేరకు  కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ, అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా తెలిపారు. ‘‘ మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం స్థిరంగానే ఉంది.వేగంగా కోలుకుంటున్నారు. ఈ మధ్య జ్వరం కూడా రాలేదు’’ అని ఆయన మీడియాకు తెలిపారు. 

ఏప్రిల్‌ 19న చిన్నపాటి జ్వరం రావడంతో ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. మన్మోహన్ ఇప్పటికే రెండు డోసుల కరోనా టీకాను వేయించుకున్నారు. మార్చి 4న తొలి విడత టీకా వేసుకోగా.. ఏప్రిల్‌ 3న రెండో దఫా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మన్మోహన్‌ కోలుకోవాలని ప్రార్థించిన భారత ప్రజలందరికీ రణదీప్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని