Mansukh Mandaviya: ఇవి నా జీవితంలో అపురూపమైన క్షణాలు..

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తన సహాయ గుణాన్ని చాటుకున్నారు. దివ్యాంగుడైన ఓ వ్యక్తికి కృత్రిమ కాలు ధరించడంలో సహకరించి, మంచి మనసు చూపించారు.

Published : 21 Feb 2022 13:11 IST

ముంబయి: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తన సహాయ గుణాన్ని చాటుకున్నారు. దివ్యాంగుడైన ఓ వ్యక్తికి కృత్రిమ కాలు ధరించడంలో సహకరించి, మంచి మనసు చూపించారు. ఇటీవల మాండవీయ రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించారు. ఇందులో భాగంగా ముంబయిలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్‌ (ఏఐఐపీఎంఆర్‌)ను సందర్శించారు. ఆ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఆదివారం ట్విటర్‌లో పంచుకున్నారు. 

‘ముంబయి పర్యటనలో భాగంగా నేను ఏఐఐపీఎంఆర్‌ సందర్శించాను. ఆ సందర్భంగా ఒక దివ్యాంగుడికి కృత్రిమ కాలు ధరించడంలో సహకరించాను. ఇవి నా జీవితంలో అపురూపమైన క్షణాలు’ అని మంత్రి రాసుకొచ్చారు. అలాగే ఆ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ పర్యటనలో మంత్రి ఆకస్మిక సందర్శనలు చేపట్టారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా అక్కడి జన ఔషధి కేంద్రాలకు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని