భారత్ టీకా కోసం వరసలో 25 దేశాలు

భారత్‌లో తయారవుతున్న కరోనా టీకా కోసం మరో 25 దేశాలు వరసలో ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్ అన్నారు.

Updated : 06 Feb 2021 19:00 IST

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్

దిల్లీ: భారత్‌లో తయారవుతున్న కరోనా టీకా కోసం మరో 25 దేశాలు వరసలో ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్ అన్నారు. ఇప్పటికే సుమారు 15 దేశాలకు టీకాలు సరఫరా చేసినట్లు శనివారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. 

‘ఇప్పటివరకు సుమారు 15 దేశాలకు కరోనా టీకాలు అందించాం. మరో 25 దేశాలు ఆ వరసలో ఉన్నాయి. టీకాల విషయంలో భారత్‌ వ్యవహరిస్తున్న తీరు... ప్రపంచం ముందు సుమున్నతంగా నిలబెట్టింది’ అని జై శంకర్ అన్నారు. గ్రాంట్ రూపంలో కొన్ని పేద దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. మరికొన్ని దేశాలు ఔషధ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం టీకా పంపిణీ జరుగుతోందన్నారు. కరోనా వైరస్ కట్టడికి భారత్‌ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. వాటిని దేశ వ్యాప్తంగా జరుగుతోన్న టీకా కార్యక్రమంలో వినియోగిస్తుండటంతో పాటు..ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తోంది. కొవిడ్ పోరాటంలో భారత్‌ చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 

అలాగే సరిహద్దులో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన గురించి మంత్రి మాట్లాడారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య తొమ్మిది దఫాలుగా చర్చలు జరిగాయని తెలిపారు. లద్దాఖ్‌ సమస్య క్లిష్టమైందని, చైనా నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సరిహద్దులో భారత్ భారీగా దళాలను మోహరించిందన్నారు. 

ఇవీ చదవండి:

100 దిగువకు కొవిడ్ మరణాలు

కొవిడ్ కొత్త రకాలను గంటలోనే పట్టేయవచ్చు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని