Sharad Pawar: శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. నటి అరెస్టు!
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఓ మరాఠీ నటిని పోలీసులు అరెస్టు చేశారు.......
ముంబయి: ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మరాఠీ నటిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పవార్‌ను ఉద్దేశించి పరోక్షంగా అనుచిత పోస్టు పెట్టినందుకు గాను నటి కేతకి చితాలే (26)ను ముంబయిలోని ఠాణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పవార్’ అనే పేరును ప్రస్తావిస్తూ.. ‘నరకం వేచిచూస్తోంది. బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు’ అంటూ కేతకి ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అందులో పవార్ వయసును 80గా ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం శరద్ పవార్ వయసు 81ఏళ్లు.
ఎన్సీపీ అధ్యక్షుడిని ఉద్దేశించే నటి ఈ పోస్టు పెట్టారంటూ స్వప్నిల్ నెట్కే అనే వ్యక్తి ఠాణెలోని కల్వా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్సీపీ కార్యకర్తలు సైతం ఆ నటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే కేతకి చితాలేను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై విలేకర్లు శరద్ పవార్ వద్ద ప్రస్తావించగా.. అసలు తనకీ విషయం తెలియదన్నారు. ఆ నటి ఎవరో, ఆమె పెట్టిన పోస్టు ఏంటో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్