Panjshir Commander: దుష్టమూకలను తరిమికొట్టి.. పంజ్‌షేర్‌ను కాపాడుకుంటాం

దుష్ట మూకలను తిప్పికొట్టి వ్యాలీని కాపాడుకుంటామని పంజ్‌షేర్‌ ఫైటర్ల నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌ పేర్కొన్నారు.....

Published : 05 Sep 2021 01:12 IST

పంజ్‌షేర్‌: తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ మొత్తాన్ని ఆక్రమిచుకున్నప్పటికీ పంజ్‌షేర్ ప్రాంతంపై మాత్రం పైచేయి సాధించలేకపోతున్నారు. తాలిబన్లను అక్కడి ఫైటర్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా తాలిబన్లు, ఉత్తర కూటమి ఫైటర్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంజ్‌షేర్‌ ఫైటర్ల నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌ స్పందించారు. దుష్ట మూకలను తిప్పికొట్టి వ్యాలీని కాపాడుకుంటామని పేర్కొన్నారు. దైవం, న్యాయం, స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్థానిక మీడియాతో వెల్లడించారు. అఫ్గాన్లు ఎన్నటికీ ఓటమిని ఒప్పుకోరని.. మహిళల స్వేచ్ఛ కోసం పోరాడుతారని మసూద్‌ తెలిపారు.

శుక్రవారం నుంచి తాలిబన్లకు, ఉత్తర కూటమి సేనల మధ్య పంజ్‌షేర్‌ సరిహద్దుల వద్ద పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంజ్‌షేర్‌ తమ వశమైనట్లు తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ విజయంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే తాలిబన్ల ప్రకటనను ఉత్తరకూటమి సేనలు ఖండిస్తున్నాయి. పంజ్‌షేర్‌ ఇంకా తమ అధీనంలోనే ఉందని, తాలిబన్లకు తాము తలొగ్గేది లేదని తాలిబన్‌ వ్యతిరేక శక్తుల నాయకులు అమరుల్లా సలేహ్‌, అహ్మద్‌ మసూద్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని