Viral Video: ఇంటి కిటికీలో ఇరుక్కుపోయిన కొండచిలువ.. ఆ తర్వాతేం జరిగిందంటే?

అరుదైన అల్బినో బర్మీస్‌ జాతికి చెందిన 10 అడుగుల భారీ కొండచిలువ (Python) ఓ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నంలో కిటికీలో ఇరుక్కుపోయింది. దాన్ని కాపాడే ప్రయత్నంలో ఏం జరిగిందంటే..

Published : 26 Sep 2023 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర(Maharashtra)లోని ఠానే నగరంలో షాకింగ్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయింది. జనావాసాల్లోకి ప్రవేశించిన ఓ అరుదైన రకానికి చెందిన కొండచిలువ(Python) ఓ పాత భవంతిలోని కిటికీలో ఇరుక్కుపోయి వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో విండోకి ఉన్న ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన ఈ 10 అడుగుల పొడవైన భారీ కొండ చిలువను కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు ఎంతో సాహసించారు. ఈ కొండచిలువను కాపాడేందుకు ఇంటిపైకి ఎక్కిన వారిద్దరూ దాన్ని బయటకు తీసే ప్రయత్నంలో అది పట్టుకోల్పోయి ఒక్కసారిగా కిందకు పడిపోయిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియలేదు. తెలుపు రంగులో కనిపించిన ఈ కొండచిలువ ఆల్బినో బర్మీస్‌ అనే అరుదైన రకానికి చెందినదిగా పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని