Avalanche: ముంచుకొచ్చిన.. మంచు ఉప్పెన!

జమ్ముకశ్మీర్‌లోని సోనామార్గ్‌లో రెండు రోజుల వ్యవధిలో మరో భారీ అవలాంచ్‌ ఏర్పడింది. దీంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు.

Published : 15 Jan 2023 01:24 IST

దిల్లీ: ఉత్తరాదిలో కనిష్ఠ ఉష్ణోగత (Least Temparature) లు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచుతో జమ్ముకశ్మీర్‌ (jammu Kashmir)లో ఈ ఏడాది తరచూ అవలాంచ్‌లు (Avalache) ఏర్పడుతున్నాయి. ప్రముఖ హిల్‌స్టేషన్‌ సోనామార్గ్‌ (Sonamarg) లో రెండు రోజుల క్రితం భారీ అవలాంచ్‌ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో ఇవాళ మరోసారి అంతకు మించిన అవలాంచ్‌ అక్కడున్నవారిని తీవ్ర భయాందోళనకు  గురిచేసింది.

ఓ నిర్మాణ సంస్థ స్థానికంగా సొరంగ మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు అదే ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. వారికి సమీపంలో ఈ అవలాంచ్‌ ఏర్పడటంతో  భయంతో పరుగులు తీశారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ హర్‌పాల్‌ సింగ్‌ వెల్లడించారు. ఆ అవలాంచ్‌కి సంబంధించిన వీడియో చూస్తే.. భయం గొలిపేలా ఉంది. నలువైపుల నుంచి మంచు కొండలు మీద కొస్తున్నట్లుగా ఉంది. దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. సాధారణ  పరిస్థితులు నెలకొనే వరకు  గదుల నుంచి  ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని