Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. వాటి వల్ల రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated : 01 Jun 2023 14:59 IST

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పర్యటిస్తోన్నవారికి¨ మరోసారి కొండచరియలు తీవ్ర అంతరాయం కలిగించాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. (Landslide Cuts Off Road)

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి భారీసంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.  మంచుకొండల్లో ప్రయాణానికి అక్కడక్కడా వీరికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది. నవంబరు రెండోవారం వరకూ ఈ యాత్ర ఉంటుంది.  ఈ సమయంలో కొండచరియలు విరిగిపడటం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్మోరా, చమోలీ, చంపావత్‌, దేహ్రాదూన్‌, హరిద్వార్‌, గర్వాల్‌, నైనిటాల్‌, రుద్రప్రయాగ, తెహ్రీ గర్వాల్‌, పితోరాగఢ్‌, ఉద్దమ్‌ సింగ్ నగర్‌, ఉత్తరకాశీ జల్లాల్లో తుపాన్‌(Dust Storm),ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. అలాగే యాత్రికులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ‘అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేయండి. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణ సూచన తర్వాతే తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలి. వెంట రెయిన్ కవర్‌, గొడుగు, వెచ్చని వస్త్రాలు ఉంచుకోవాలి’అని అందులో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని