ముంబయి: అలా చేస్తే రాత్రి కర్ఫ్యూ అవసరం లేదు..

దేశంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నగరవాసులు కలిసి కట్టుగా కృషి చేయాలని ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ గురువారం చెప్పారు...

Published : 18 Mar 2021 20:12 IST

ముంబయి: దేశంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నగరవాసులు కలిసి కట్టుగా కృషి చేయాలని ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతానికి రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదు. రద్దీగా ఉన్న మార్కెట్లను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నాం. కరోనా జాగ్రత్తలు పాటించి లాక్‌డౌన్‌ అవసరం లేకుండా చేసే బాధ్యత ముంబయివాసులపై ఉంది. వార్డు స్థాయిలో వాలంటీర్లు కొవిడ్‌-19 పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’ అని ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని