Updated : 12/03/2021 23:09 IST

ఆగస్టు 1న నీట్‌ పరీక్ష

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష తేదీని జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.  ఆగస్టు 1న ఆదివారం రోజు ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ పరీక్షను ఒక్కసారే నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో కఠిన నిబంధనలతో గతేడాది మాదిరిగానే నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 11 భాషల్లో నీట్‌ యూజీ -2021 పరీక్షను ఆగస్టు 1న నిర్వహిస్తామని ఏజెన్సీ తెలిపింది.  సంబంధిత వెబ్‌సైట్‌లో  దరఖాస్తులు లభ్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఈ సారీ పెన్ను, పేపర్‌ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని