
వయస్సు 5.. మాట్లాడే భాషలు 3
ఈ బుడతడే నా కొత్త ఫ్రెండ్: దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా
ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల పిల్లలు ఏది మాట్లాడినా ముద్దుముద్దుగా ఉంటుంది. అలాంటిది ఆ బాలుడు మూడు భాషలను అలవోకగా, స్పష్టంగా మాట్లాడేస్తాడట. ఇదే విషయాన్ని గురువారం దిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మనీశ్ సిసోదియా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘ ఈరోజు నాకు ఓ చిన్నారి స్నేహితుడయ్యాడు. అతని పేరు హితెన్. ఐదేళ్ల వయస్సులోనే మూడు భాషలు... ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లిష్ అలవోకగా మాట్లడగలడు. హితెన్.. నిన్ను కలవడం చాలా బాగా అనిపించింది’’ అంటూ అతడితో దిగిన ఫొటోలను ట్వీట్ చేశారు. అక్షరాలు, ఎవరైనా మాట్లాడుతుంటే.. వారి వాయిస్‌ను త్వరగా అర్థం చేసుకొని గ్రహించే శక్తి చిన్నవయసు నుంచే హితెన్కు అలవడిందట. ప్రస్తుతం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కెందుకు కసరత్తు చేస్తున్నాడీ ఈ బుడతడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.