బిల్‌గేట్స్ గారాల కూతురి గురించి తెలుసా?
ఫీబీ అడెల్ గేట్స్.. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిందా గేట్స్ గారాల కూతురు. 18 ఏళ్ల ఈ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫొటోలను పంచుకుంటోంది.
ఇంటర్నెట్‌డెస్క్: ఫీబీ అడెల్ గేట్స్.. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిందా గేట్స్ గారాల కూతురు. 18 ఏళ్ల ఈ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫొటోలను పంచుకుంటోంది. గేట్స్ దంపతులు తమ విడాకుల గురించి మే 4న ప్రకటించాక అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించినట్లు వారు ట్విటర్ ద్వారా వెల్లడించారు. గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే చిన్నమ్మాయి ఫీబీ అడెల్ గేట్స్. బిల్‌గేట్స్ లక్షణాలు ఆయన చిన్న కూతురిలో పుష్కలంగా ఉన్నాయని, ఎప్పటికైనా ఆయనలాగే ఆమె కూడా స్వతహాగా పైకొస్తుందని కొందరు అంటుంటారు. మరి గేట్స్ దంపతుల ముద్దుల కూతురి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?
తండ్రి తెలివి తేటల్ని ఫీబీ పుణికి పుచ్చుకుందని తెలిసినవారు అంటుంటారు. ఏప్రిల్ 14,2002లో వాషింగ్టన్‌లో ఆమె జన్మించింది. చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా, అందరితో కలిసి మెలిసి ఉండేది. తొలుత న్యూయార్క్‌లోని ప్రొఫెషనల్ చిల్డ్రన్ పాఠశాలలో చేరింది. ఆ తర్వాత లింకన్ సెంటర్‌లోని అమెరికన్ బ్యాలెట్ పాఠశాలలో ఆర్ట్స్ అధ్యయనం చేసింది. సంపన్నుడి కూతురైనప్పటికీ తన 14వ ఏట వరకు ఫీబీ స్మార్ట్‌ఫోన్‌కు దూరంగానే ఉంది. అయితే అందులో గేట్స్ పాత్ర కూడా ఉంది. పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే కొంతకాలం వాళ్లని స్మార్ట్‌ఫోన్లకి దూరంగా ఉంచాలని గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఫీబీ అప్పుడప్పుడు పొట్టిపొట్టి దుస్తుల్లో తళుక్కుమని మెరుస్తుంటుంది. కొన్నాళ్ల క్రితం బోటు షికారులో బికినీ వేసుకొని దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. డిగ్రీ పట్టా ప్రదానోత్సవానికి నగలు పొదిగిన తెల్లటి పొడవాటి గౌను వేసుకొని వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచింది. జీవితం హాయిగా సాగిపోతున్న తరుణంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం.. వయస్సులో చిన్నదైన ఫీబీకి కాస్త ఇబ్బందికర అంశమే. అంతేకాకుండా తాను సంపాదించిన ఆస్తి తన సంతానానికి చెల్లబోదని బిల్‌గేట్స్ ఇప్పటికే ప్రకటించారు. ముగ్గురికీ తలో 10 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తానని, మిగతా సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన అక్కల పరిస్థితిని పక్కన పెడితే, ఫీబీ మాత్రం తన తండ్రిలా స్వతహాగా పైకొచ్చే అమ్మాయని కొందరు అంటుంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Gas Cylinder : తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
-
Politics News
Rahul Gandhi : నేడో, రేపో ‘రాహుల్ పిటిషన్’!
-
India News
Punjab: గుర్రాల పెంపకంతో భలే ఆదాయం
-
India News
Digital Water Meters: అపార్ట్మెంట్లలో డిజిటల్ వాటర్ మీటర్లు
-
Ap-top-news News
Covid Tests: శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు
-
Politics News
అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!