మెల్‌బోర్న్‌లో మరోసారి లాక్‌డౌన్‌

ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో కరోనా కారణంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. శుక్రవారం నుంచి ఐదురోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. విక్టోరియా రాష్ట్రం అంతటా లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నారు....

Updated : 29 Feb 2024 18:21 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో కరోనా కారణంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. శుక్రవారం నుంచి ఐదురోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. విక్టోరియా రాష్ట్రం అంతటా లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నారు. మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ ప్రేక్షకులు లేకుండా కొనసాగనుంది. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ మెల్‌బోర్న్‌ విమానాశ్రయం హోటళ్లో వెలుగుచూసింది. అది 13 మందికి సోకడంతో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ నిబంధన మెల్‌బోర్న్‌లో ఇప్పటికే అమలవుతోంది.

ఇవీ చదవండి...

అంతవరకు హెచ్‌1బి వీసాలివ్వొద్దు

చైనా.. యూకే.. మీడియా యుద్ధం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని