Published : 30 Aug 2021 17:40 IST

Taliban Rule: బాలికలకు పురుష టీచర్లు చదువు చెప్పకూడదు.. అఫ్గాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం

కాబుల్‌: మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన తాలిబన్ల మాటలు నీటి మూటలుగా మారిపోయాయి. గతంలో హెరాత్ ప్రావిన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించిన తాలిబన్లు.. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. బాలికలకు పురుషులు విద్య చెప్పకూడదని హకుం జారీ చేశారు. ‘ఆడపిల్లలకు విద్య బోధించేందుకు పురుషులను అనుమతించబోం’ అని అఫ్గాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్‌ అబ్దుల్‌ బాకీ హక్కానీ స్పష్టం చేశారు. కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే విద్యాసంస్థల కార్యకలాపాలు కొనసాగాలని హక్కానీ సూచించారు.

కాబుల్‌లో జరిగిన ఓ సభలో హక్కానీ ప్రసంగించారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం పొందిన మరుసటి రోజే హక్కానీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అప్గానిస్థాన్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని.. ప్రజలు, ఉపాధ్యాయులందరూ భరోసాగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న విద్యావ్యవస్థను హక్కానీ విమర్శించారు. షరియా నిబంధనలకు వ్యతిరేకంగా నడిచిందని.. ఇప్పుడు అలాంటి ఆటలు సాగనివ్వబోమని పేర్కొన్నారు. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రజలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ వనరులు లేని కారణంగా ఈ నిర్ణయం విద్య నుంచి బాలికలను మరింత దూరం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని