
వంతెన కూలి కిందపడ్డ మెట్రో రైలు..
15 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. వంతెన కూలి దానిపై వెళుతున్న మెట్రో రైలు కిందపడగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మెక్సికో సిటీలో ఓ వంతెనపై మెట్రో రైలు దూసుకెళుతుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ రైలు కింద వెళుతున్న కార్లపై పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 70 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మెట్రో లైన్ పురాతనమైనదని, అందువల్లే సంభవించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనపై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు చేస్తున్నామని, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.