​​​​​​Bengal violence: గవర్నర్‌ను నివేదిక కోరిన హోంశాఖ

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. హింసపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని...

Published : 06 May 2021 16:14 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. హింసపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరినప్పటికీ ఎలాంటి స్పందనా లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌కు సూచించింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలంది. ఇప్పటికే కేంద్రహోంశాఖ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఎన్నికల అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన గూండాలు తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను హతమార్చారంటూ భాజపా ఆరోపించింది. దీన్ని మమత ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు కేంద్రమంత్రి మురళీధరన్‌ కారుపై రాళ్లు, కర్రలతో గురువారం దాడి జరిగింది. తృణమూల్‌ కార్యకర్తలే దీనికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని