Cyber Crimes: ‘ఒమిక్రాన్‌ టెస్ట్‌ ఉచితం’.. ఇలాంటి ఈ-మెయిళ్లనునమ్మెద్దు!

కొవిడ్‌ పరీక్షల విషయంలోనూ సైబర్‌ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. దేశంలో ఒకవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని ఆశ చూపి, అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కొన్నాళ్లుగా...

Published : 31 Dec 2021 23:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ పరీక్షల విషయంలోనూ సైబర్‌ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. దేశంలో ఒకవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని ఆశ చూపి, హానికర ఈ-మెయిళ్లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ తరహా మోసాలను గమనించిన కేంద్ర హోంశాఖ సైబర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగం.. పౌరులంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.

‘సైబర్‌ నేరగాళ్లు ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభ పరిస్థితులను అవకాశంగా మలచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఒమిక్రాన్‌ సంబంధిత మోసాలు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ నిర్ధారణకు ఉచిత పరీక్షల పేరిట హానికరమైన లింక్స్‌, ఫైళ్లతో ఈ-మెయిల్స్‌ పంపుతున్నారు. పౌరులను బోల్తా కొట్టించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంస్థల పేర్లనూ వాడుకుంటున్నారు. ఆ లింక్‌లపై క్లిక్ చేసిన వారిని నకిలీ వెబ్‌సైట్‌లకు మళ్లించి.. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు సేకరిస్తున్నారు. వాటితో ఆర్థిక, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు’ అని అందులో వివరించింది. ఇటువంటి ఈ-మెయిల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వెబ్‌సైట్‌ల ప్రామాణికతను చెక్‌ చేసేందుకు డొమైన్ పేరు, యూఆర్‌ఎల్‌ను పరిశీలించాలని సూచించింది. ఈ తరహా ఘటనలపై cybercrime.gov.inకు సమాచారం అందజేయాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని