Unlock: మహారాష్ట్రలో ఐదు స్థాయిల్లో అన్‌లాక్‌!

కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో మగ్గిన మహారాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఉపశమనం లభించనుంది. మొత్తం ఐదు స్థాయిల్లో క్రమంగా లాక్‌డౌన్‌ను సడలించనున్నట్లు......

Updated : 05 Jun 2021 13:07 IST

ముంబయి: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో మగ్గిన మహారాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఉపశమనం లభించనుంది. మొత్తం ఐదు స్థాయిల్లో క్రమంగా లాక్‌డౌన్‌ను సడలించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల అందుబాటును దృష్టిలో ఉంచుకుని అన్‌లాక్‌ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రత ఆధారంగానే ఆంక్షల సడలింపు ఉంటుందని తెలిపింది. ప్రతి గురువారం ప్రభుత్వ ఆరోగ్య విభాగం రాష్ట్రంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుందని పేర్కొంది.

లెవెల్‌-1: పాజిటివిటీ రేటు ఐదు శాతం లేదా అంతకంటే తక్కువ ఉండి,  ఆసుపత్రుల్లో పడకలు 25 శాతం కంటే తక్కువ నిండి ఉన్న జిల్లాలు లెవెల్‌ 1 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తారు. ప్రజా రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్‌, థియేటర్లు, మాల్స్‌, పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అనుమతి లభిస్తుంది. వివాహాలు, అంత్యక్రియలు ఎలాంటి నిబంధనలు లేకుండా సాధారణంగా జరుపుకునేందుకు అనుమతిస్తారు. 

లెవెల్‌-2: ఐదు శాతం పాజిటివిటీ రేటు, ఆసుపత్రుల్లో 25-40 శాతం పడకలు నిండి ఉన్న  జిల్లాలు లెవెల్‌2 కిందకు వస్తాయి. ఇక్కడ సెక్షన్‌ 144 అమల్లో ఉంటుంది. థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, సెలూన్లు 50 శాతం సామర్థ్యంలో తెరవొచ్చు. ఇతర దుకాణాలు సాధారణ సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. 

లెవెల్‌-3: పాజిటివిటీ రేటు 5-10 శాతం, ఆసుపత్రుల్లో 40-60 శాతం పడకలు నిండి ఉన్న  జిల్లాలు లెవెల్‌3 కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలు, జిమ్‌లు, సెలూన్లు, రెస్టారెంట్లు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. మాల్స్‌, థియేట్లు, మూసి ఉంటాయి. సెక్షన్‌ 144 అమల్లో ఉంటుంది.

లెవెల్‌-4:  పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 60-75 శాతం పడకలు నిండి ఉన్న  జిల్లాలు లెవెల్‌-4 కిందకు వస్తాయి. అన్ని నిత్యవసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 5 గంటలు, వారాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది. పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజా  రవాణా 50శాతం సామర్థ్యంతో కొనసాగాలి. 

లెవెల-5: పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 75 శాతం కంటే ఎక్కువ పడకలు నిండి ఉన్న  జిల్లాలు లెవెల్‌-5 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని