Union Budget 2022: ‘మిడిల్‌ క్లాస్‌’ కష్టాలు.. బడ్జెట్‌పై మీమ్స్‌ వెల్లువ

ఐటీ శ్లాబ్ పెంచకపోవడం, క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించడం పట్ల నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.......

Published : 02 Feb 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రక్షణ రంగం, విద్యా రంగం, వ్యవసాయం, పర్యాటకం, హైవేలు.. ఇలా దేశ నిర్మాణంలో కీలకమైన రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కింది. అయితే ప్రస్తుత ఆదాయపు పన్ను విధానంలో కొన్ని మార్పులను ప్రవేశపెడతారని మధ్యతరగతి ప్రజలు ఆశించారు. ఐటీ శ్లాబ్ పెంచకపోవడం, క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించడం పట్ల నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో #Budget2022, #IncomeTax హ్యాష్‌ట్యాగ్‌లు ఇంటర్నెట్‌లో ఎంతగా ట్రెండ్‌ అయ్యాయో.. ‘మిడిల్‌ క్లాస్‌’ అనే పదం కూడా అంతే ట్రెండింగ్‌లో ఉంది. సామాన్య మానవుడి జీవితంలో మార్పు లేదంటూ వస్తోన్న మీమ్స్‌ నవ్విస్తున్నాయి.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని