Mumbai Hit and Run: హిట్‌ అండ్‌ రన్ కేసు.. 72 గంటల తర్వాత మిహిర్‌ షా అరెస్టు

ముంబయిలో ర్యాష్‌ డ్రైవింగ్‌తో వివాహిత మరణానికి కారణమైన శివసేన నేత కుమారుడు మిహిర్‌ షా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Published : 09 Jul 2024 17:56 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన (Shiv Sena) నేత రాజేశ్‌ షా కుమారుడు మద్యం మత్తులో డ్రైవింగ్‌ (Mumbai Hit and Run) చేసి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన తీవ్ర దుమారానికి దారి తీసింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. మూడు రోజులుగా పరారీలో ఉన్న నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇటీవల ముంబయిలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారు వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. మహిళపై నుంచి కారు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత వాహనాన్ని కొంత దూరంలో వదిలి మిహిర్‌ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడికి సహకరించిన కొందరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిందితుడి తండ్రి రాజేశ్‌ షా కూడా ఉన్నారు.

హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటీ? సిట్‌ నివేదిక ఏం చెప్పిందంటే..!

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆదేశాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. అతడి ఆచూకీ కోసం 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశముందన్న అనుమానంతో లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ)ను జారీ చేశారు. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్‌ షాను పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు