సారీ ప్రెసిడెంట్.. అలా చేయలేకపోయా...
ఒక్క నిర్ణయంతో నైతిక విజయం సాధించిన మైక్ పెన్స్
వాషింగ్టన్: అమెరికాకు రెండో సారి అధ్యక్షుడయ్యేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వీడకుండా ట్రంప్ చేసిన ప్రయత్నం.. ఆ దేశ చరిత్రలోనే ఎవరూ ఊహించని పరిణామానికి దారితీసింది. మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్ వైఖరి.. వారు ఆ దేశ చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి చేసే వరకూ తీసుకొచ్చింది. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిర్ణయం ప్రజాస్వామ్య భావనకు, రాజ్యాంగ నిబద్ధతకు తిరుగులేని నిదర్శనంగా నిలిచింది.
గెలిపించు.. పెన్స్‌కు ట్రంప్ సూచన
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి విజేతను అధికారికంగా ప్రకటించే కాంగ్రెస్ ఉమ్మడి పాలక సభ (జాయింట్ కాంగ్రెషనల్ సెషన్) సమావేశానికి.. ఆ దేశ ఉపాధ్యక్షుడైన పెన్స్ నేతృత్వం వహిస్తారు. పరాజయాన్ని తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్న ట్రంప్.. తమ పార్టీకే చెందిన మైక్ పెన్స్‌ను పావుగా వాడుకోవాలనే ఆలోచన చేశారు. ఎన్నికల ఫలితాలను తిప్పి పంపే అధికారం పెన్స్‌కు ఉందంటూ ట్రంప్ బహిరంగంగానే ట్వీట్ చేశారు. ‘సరైన’ చర్య తీసుకోవాల్సిందిగా బుధవారం నాటి కాంగ్రెస్ సమావేశానికి ముందు కూడా ట్రంప్, ఉపాధ్యక్షుడికి అన్యాపదేశంగా సూచించారు.
అభ్యంతరం సరే.. అంగీకరించలేను
ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో.. తన నిర్ణయాన్ని పెన్స్ స్పష్టం చేశారు. ‘‘నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కొన్ని రాష్ట్రాల ఫలితాలను పరిగణించ వద్దంటూ కొందరు విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాలను లేవనెత్తి, అందుకు తగిన ఆధారాలను సమర్పించే చట్టబద్ధమైన హక్కును నేను ఆమోదిస్తాను. ఐతే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా రాజ్యాంగానుసారం వ్యవహరిస్తానని నేను ప్రమాణం చేశాను. చట్టబద్ధంగా లభించిన ఎలక్టోరల్ ఓట్లను పరిగణించకుండా చేసే అధికారం నాకు లేదు. దీనితో వారి డిమాండుకు ఆమోదముద్ర వేయరాదనే నిర్ణయానికి వచ్చాను.’’ అంటూ ఆయన కుండ బద్దలు కొట్టారు.
ఇటీవలి పరిణామాలతో రెండో సారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టే మాట అటుంచి.. అగ్రరాజ్య చరిత్రలోనే చీకటి అధ్యాయం అనదగ్గ సంఘటనలకు కారకుడనే చెడ్డపేరును ట్రంప్ మూటకట్టుకోవాల్సి వచ్చింది. ట్రంప్ ఓటమిని తిరగరాసే అధికారం తనకు లేదంటూ మైక్ పెన్స్ నిష్కర్షగా చేసిన ప్రకటన కూడా అమెరికా చరిత్రలో ఆయన విజ్ఞతకు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచిపోతుంది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
social look: ‘మిస్బి’గా తమన్నా.. నిఖిల్ రిక్వెస్ట్.. శునకానికి సోనూ ట్రైనింగ్..
-
India News
DGCA: విమానాలకు పక్షుల ముప్పు! డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ
-
Politics News
KTR: ఉచిత పథకాలన్నీ రద్దు చేసి వచ్చే ఎన్నికలకు వెళ్తారా?: మోదీని ప్రశ్నించిన కేటీఆర్
-
India News
Space: భారత్‌కు అంతరిక్షం నుంచి సందేశం..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు