Assam Rifles: అస్సాం రైఫిల్స్‌ శిబిరాలపై మిలిటెంట్ల దాడి

ఈశాన్య భారత్‌లోని ఇండో-మయన్మార్‌ సరిహద్దుల్లోని పలు చోట్ల భద్రతా దళాలపై దాడులు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అస్సాం రైఫిల్స్‌ శిబిరాలపై ఉల్ఫా-ఐ, ఎన్‌ఎస్‌సీఎన్‌ (నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాల్యాండ్‌) మిలిటెంట్లు

Updated : 09 Aug 2022 10:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య భారత్‌లోని ఇండో-మయన్మార్‌ సరిహద్దుల్లోని పలు చోట్ల భద్రతా దళాలపై దాడులు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అస్సాం రైఫిల్స్‌ శిబిరాలపై ఉల్ఫా-ఐ, ఎన్‌ఎస్‌సీఎన్‌ (నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌) మిలిటెంట్లు ఈ తెల్లవారు జామున దాడులు నిర్వహించారు. ఆ రాష్ట్రంలోని చంగ్‌లాంగ్‌ జిల్లాలోని పంచుంగుపాస్‌ వద్ద అస్సాం రైఫిల్స్‌ సరికొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్‌పై, అదే రాష్ట్రంలో నకనో అనే ప్రాంతంలో ఈ దాడులు చోటుచేసుకొన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన భద్రతా దళాలు ఎదురుదాడి చేపట్టాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఒక జవాను మరణించినట్లు వార్తలొస్తున్నాయి. అధికారికకంగా దీనిని ధ్రువీకరించలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి.

మరోవైపు నాగాలాండ్‌ చెరమోతలోని ఆర్మీ క్యాంపుపై మరో మిలిటెంట్‌ బృందం దాడి చేసింది. వీరు మోర్టార్లను ఉపయోగించి దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం రాలేదు. ఈశాన్య భారత్‌లోని పలు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని ఉల్ఫా-ఐ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్‌ పరేష్‌ బారువా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాడు.

ఈ ఘటనపై ఉత్తర అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్న రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఏఎస్‌ వాలియా స్పందించారు. మయన్మార్‌ సరిహద్దుల వెంట అస్సాం రైఫిల్స్‌ జవాన్లు గస్తీ నిర్వహిస్తుండగా మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. చంగ్‌లాంగ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి గాయపడినట్లు పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని