Cabinet: మోదీ నివాసానికి కాబోయే మంత్రులు

మరికొద్ది గంటల్లో కేంద్రమంత్రి వర్గం మారనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆహ్వానం అందుకున్న నేతలు ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి

Updated : 07 Jul 2021 13:30 IST

దిల్లీ: మరికొద్ది గంటల్లో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆహ్వానం అందుకున్న నేతలు ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ రాణే, హీనా గవిట్‌, శర్వానంద్‌ సోనోవాల్‌, శోభ, కపిల్‌ పాటిల్‌, అనుప్రియ పటేల్‌, భగవత్‌ కేవడ్‌, అజయ్‌ భట్, అజయ్‌ మిశ్రా, మీనాక్షి లేఖి, రీటా బుహుగుణ, ఆర్సీపీ సింగ్‌, భూపేంద్ర యాదవ్‌, పశుపతి పరాస్‌ తదితరులు లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వచ్చారు. అటు కేంద్రమంత్రలు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీ నివాసానికి చేరుకున్నారు. వీరితో మోదీ సమావేశమయ్యారు. 

కిషన్‌రెడ్డికి పదోన్నతి..!

కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో ప్రధాని నివాసానికి రావాలని ఆయనకు పిలుపు అందింది. దీంతో ఆయన లోక్‌కల్యాణ్‌ మార్గ్‌కు చేరుకున్నారు. ఆయనకు కేబినెట్‌ మంత్రిగా తీసుకోనున్నట్లు సమాచారం. కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వశాఖను కిషన్‌రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అటు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకునే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఆయనకు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే. కొత్తగా 22 మందికి అవకాశం లభిస్తుందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు