Abortions: మైనర్ల అబార్షన్లను గోప్యంగా ఉంచొచ్చు.. పోలీసులకు చెప్పనక్కర్లేదు: సుప్రీంకోర్టు

వివాహితులు, అవివాహితులనే వివక్ష లేకుండా దేశంలో మహిళలందరూ 24 వారాల్లో సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చంటూ గురువారం చరిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు..  మైనర్‌ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పృశించింది.

Updated : 01 Oct 2022 07:09 IST

దిల్లీ: వివాహితులు, అవివాహితులనే వివక్ష లేకుండా దేశంలో మహిళలందరూ 24 వారాల్లో సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చంటూ గురువారం చరిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు..  మైనర్‌ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పృశించింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టపరిధిని మైనర్లకూ విస్తరిస్తూ.. వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్‌ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. అందుకు అడ్డుగా ఉన్న  పోక్సో చట్టంలోని సెక్షన్‌ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. ఈ సెక్షన్‌ ప్రకారం.. అబార్షన్‌కు సంప్రదించిన మైనర్‌ సమాచారాన్ని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌(ఆర్‌ఎంపీ).. స్థానిక పోలీసులకు తెలపాలి. లేకపోతే నేరం. ఈ నేపథ్యంలో గురువారం తీర్పులో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ సెక్షన్‌ నుంచి వైద్యులకు మినహాయింపిచ్చింది. మైనర్‌ లేదా మైనర్‌ సంరక్షకుడి విజ్ఞప్తి మేరకు గర్భవిచ్ఛిత్తి వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచవచ్చని పేర్కొంది. పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం లేకుండా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని