UP Election 2022: ఈవీఎంపై ఫెవిక్విక్‌ పోసిన దుండగులు..!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడతలో 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 22.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 23 Feb 2022 13:11 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడతలో 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 22.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ లఖ్‌నవూలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి భాజపా చరిత్రను పునరావృతం చేస్తుందన్నారు. అంతేగాకుండా మునపటి కంటే ఎక్కువ స్థానాలు గెల్చుకునే అవకాశం ఉందన్నారు. 

ఈవీఎంపై ఫెవిక్విక్‌ పోసిన దుండగులు.. కడిపూర్సాని ప్రాంతంలో కొందరు దుండగులు ఈవీఎంపై ఫెవిక్విక్‌ పోశారు. లఖింపుర్ ఖేరిలో ఎస్పీ తరఫున పోటీ చేస్తోన్న ఉత్కర్ష్‌ వర్మ ఈ ఘటనపై ఆరోపణలు చేశారు.  వారు ఎస్పీ సైకిల్ గుర్తుపై ఫెవిక్విక్ విసిరారన్నారు. కాగా, అధికారులు ఈవీఎంను మార్చడంతో మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. అలాగే లఖ్‌నవూ, బండా తదితర ప్రాంతాల్లో ఈవీఎంల పనితీరు గురించి ఎస్పీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని