Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ను 2028లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో అధిపతి డా.సోమనాథ్ వెల్లడించారు.
శ్రీహరికోట, న్యూస్‌టుడే: శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ను 2028లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో అధిపతి డా.సోమనాథ్ వెల్లడించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాలు చేపట్టనున్నామని తెలిపారు. అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన నాలుగో ఇండియన్ ప్లానెటరీ సైన్సు కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీతో చంద్రుడిపై మిషన్ గురించి చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ల్యాండ్ రోవర్ నిర్మించి జపాన్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మూడు రోజుల మిషన్ కోసం ముగ్గుర్ని 400 కి.మీ. ఎత్తున కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం ద్వారా దేశానికున్న మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్