MK Stalin: నీట్‌ కుంభకోణానికి ముగింపు పలకాలి: ఎంకే స్టాలిన్

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024లో చోటుచేసుకున్న అక్రమాలకు ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.   

Published : 14 Jun 2024 17:48 IST

చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్(MK Stalin) శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ‘‘ఎవరూ మన దగ్గర దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు.. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. నీట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని తమిళనాడు మొదట చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం దీనిని సమర్థిస్తోంది. ఎటువంటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదు’’ అని అన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan) సోషల్‌ మీడియా పోస్ట్‌లో ‘‘నీట్‌ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థులు దేనికోసం ఆందోళనలు చేపడుతున్నారో వాటిని న్యాయంగా పరిష్కరిస్తామని నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికీ నష్టం జరగదు. వారి భవిష్యత్తు ప్రమాదంలో పడదు’’ అని వ్యాఖ్యానించారు. 

2024లో నీట్‌-యూజీ(NEET-UG) 1,563 ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తీసేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొంది. జూన్ 30లోగా ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హామీ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని