ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్‌ఎల్‌పీ నేత వాదన

ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఎన్నికై రెండు సభల్లోనూ కొనసాగితే తప్పేంటని ఆర్‌ఎల్‌పీ నేత హనుమాన్‌ బినివాల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Published : 19 Jun 2024 00:08 IST

జైపుర్‌: ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైతే.. రెండు సభల్లోనూ కొనసాగేలా నిబంధన ఉండాలని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) నేత హనుమాన్‌ బినివాల్‌ (Hanuman Beniwal) అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన కొత్త వాదనను తెర పైకి తీసుకువచ్చారు. అమెరికాలో ఇటువంటి నిబంధన ఉందని.. భారత్‌లోనూ ఇలా ఉంటే బాగుంటుందన్నారు.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 101(2) ప్రకారం.. విధానసభ సభ్యుడిగా.. ఎంపీగా ఒకేసారి సమయంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగడానికి వీలు లేదు. అయితే.. అమెరికాలో ఇందుకు వీలుందని.. భారత్‌లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ‘‘రెండు పదవులు ఉండటం వల్ల కలిగే ఇబ్బందులేంటి? ప్రజలే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలోనూ ఆర్‌ఎల్‌పీ పోటీ చేస్తుంది’’ అని బినివాల్‌ పేర్కొన్నారు.

కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్‌ నేత

త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తో పొత్తుపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా పోరాడుతామని.. పాత పద్ధతిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని