Cyber Crime: వామ్మో.. స్కామ్‌ కాల్స్‌తో 53 బిలియన్‌ డాలర్లు కొల్లగొట్టారా?

గతేడాది మొబైల్‌ యూజర్లు (Mobile Users) స్కామ్‌ కాల్స్‌ (Scam Calls) కారణంగా సుమారు 53 బిలియన్‌ డాలర్లు కోల్పోయారని జుపనీర్‌ రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఈ తరహా మోసాల కారణంగా కోల్పోయే మొత్తం విలువ రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. 

Published : 21 Mar 2023 00:40 IST

దిల్లీ: సైబర్‌ నేరాల (Cyber Crimes) తీరు రోజురోజుకీ మారిపోతోంది. స్పామ్‌/స్కామ్‌ కాల్స్‌ (Spam/Scam Calls) గురించి ప్రజలను హెచ్చరిస్తున్నప్పటికీ,  అవగాహన లోపంతో కొందరు నష్టపోతున్నారు. మోసపూరిత స్కామ్‌ కాల్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఈ ఏడాది సుమారు 58 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కోల్పోతారని జునీపర్‌ రీసెర్చ్‌ (Juniper Research) అనే సంస్థ అంచనా వేసింది. గతేడాది మొబైల్‌ యూజర్లు (Mobile Users) స్కామ్‌ కాల్స్‌ కారణంగా సుమారు 53 బిలియన్‌ డాలర్లు కోల్పోయారని వెల్లడించింది. వినియోగదారులకు అందించే సేవల విభాగంలో రోబో ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు స్కామ్‌ కాల్స్‌ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.

2027 నాటికి ఈ తరహా మోసాల వల్ల మొబైల్‌ యూజర్లు కోల్పోయే మొత్తం విలువ 70 బిలియన్‌ డాలర్లు ఉంటుందని జుపనీర్‌ అంచనా వేసింది. మోసపూరిత స్కామ్‌ కాల్స్‌ వల్ల ఎక్కువ నష్టపోతున్న ప్రాంతాల్లో ఉత్తర అమెరికా (North America) మొదటి స్థానంలో ఉంది. కాల్‌ ఫార్వాడింగ్‌ (Call Forwarding), కాలర్‌ ఐడీ స్పూఫింగ్‌ (Call ID Spoofing) వంటి టూల్స్‌ సాయంతో ఈ తరహా మోసాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని జునీపర్‌ తెలిపింది. వీటిని గుర్తించేందుకు వీలుగా  మొబైల్ తయారీ సంస్థలు ప్రత్యేకమైన టూల్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలానే యూజర్లు సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకోవద్దని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని