సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి: మోదీ

తాగునీటి కోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పీఎం ఆత్మనిర్భర్‌ నిధి కింద లబ్ది పొందుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వీధి వ్యాపారులతో ఆయన బుధవారం వీడియోకాల్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ వారికి పలు సూచనలు చేశారు.

Published : 09 Sep 2020 14:32 IST

భోపాల్‌: తాగునీటి కోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పీఎం ఆత్మనిర్భర్‌ నిధి కింద లబ్ది పొందుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వీధి వ్యాపారులతో ఆయన బుధవారం వీడియోకాల్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ వారికి పలు సూచనలు చేశారు. తాగునీటి కోసం అందరూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు స్వస్తి చెప్పి మట్టి కుండల వైపు మొగ్గు చూపాలని సూచించారు. చగన్‌లాల్‌ అనే చీపుర్ల తయారీ వ్యాపారితో మాట్లాడుతూ..  వారి కుటుంబానికి ఉజ్వల్‌ యోజన పథకం ఎలా లబ్ది చేకూర్చిందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో సూచనలు చేశారు. గ్వాలియర్‌కు చెందిన మహిళకు ఆయుష్మాన్‌ పథకం ప్రాధాన్యం తెలిపారు. కూరగాయల వ్యాపారులు లావాదేవీల కోసం డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. అ పద్దతిని వారు అలాగే కొనసాగించాలని ప్రోత్సహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని